ఆయుష్షు
జన్మ మొదలు అంత్యం (మృత్యువు) వరకు నున్న కాలము
ఆయుష్షు అని చెప్పపడుచున్నది. ఇది ప్రతి జీవ జాలము నందు
(మానవ పశు పక్ష్యాదులు) నకు నిర్ధారణ కాబడుచున్నది. ఆయుష్షు మానవుని యందు, బాల్య, యౌవ్వన, కౌమార, వృద్ధాప్యము అను దశలుగా విభజింపబడినది.
కాలమను రహస్యముచే వారి ఆయుష్షు నిర్దారింపబడుచున్నది. ఆయుష్షు రూపముననున్న జీవిత కాలమున ఆ వ్యక్తి యొక్క మహొన్నతిని, ఆయుష్షు అనంతరము కొనియాడుట లోకసహజం. అంత్య దశయందు అనగా మృత్యువు ఆసన్నమగు సమయమందు ఆ వ్యక్తిత్వమునకు మరణ దశ యొక్క సూచనలు కొన్ని తెలియబడుచున్నవి. ఆ సూచనలు బహు కొద్ది మంది మాత్రమే అవగాహన చేసికొనగలరు. మృత్యువు అనంతరం ఇతరులు కొంత మంది ఆ సూచనల యొక్క సారాంశము గ్రహించగలరు.
ఆయుష్షు అనునది బలీయమైన కాలమనే రహస్యము యొక్క, ఆ శక్తిని పొందుట దుస్సాధ్యము. సామాన్య మానవులు, వైద్య పరమైన సిద్ధాంతములను అనుసరించి, మానవుని ఆయుష్షును వృద్ధి చేయు సంకల్పముతో ప్రయత్నము చేయుచున్నారు. ఆయుష్షు రూపమున జీవయాత్ర సాగిస్తున్న మానవుడు భౌతికమున తాను మహొత్కృష్టమైన స్థానమును పొంది ఆయుష్షు అనంతరం అమరుడై కీర్తింప బడతాడు. ఆ మహా పురుషుల ఆదర్శాలను పాటించి మనకు నిర్ధారించిన ఆయుష్షును సద్వినియోగపరచుకొనవలెను.
దేవతలు అమృతము ఆరగించుట ద్వారా ఆయుష్షును, మానవులు సంజీవిని పొందుట వల్ల ఆయుష్షు వృద్ది చెందినట్లు పురాణగాధలలో తెలియబడుచున్నది. స్థితిగతులు మరియు కాలమనే రహస్యముచే వాడికి నిర్దేశించబడిన ఆయువును అనుసరించి వాడి ఆయువు అనునది ఉన్నది. ఆయువు, ఆరోగ్యము పొందుటకై మానవుడు భగవంతుని మరియు సత్పురుషుల సాన్నిధ్యమును ఆశ్రయించు చున్నాడు.